31 Dec 2012

సన్యాసి కి , సన్నాసి కి తేడా ఏమిటి?


రంగడు  : సన్యాసి కి , సన్నాసి కి తేడా ఏమిటి?

  లింగం : సన్యాసి అంటే అందరిని వదిలివేసిన వాడు అన్నట్టు...
             ఇక సన్నాసి అంటే వాణ్ణి అందరు వదిలివేసినవాడు ....

30 Dec 2012

కాఫీ షాప్ కి , వైన్ షాప్ కి మధ్య తేడా వారికి మాత్రమే తెలుసా ...?




రంగడు :  కాఫీ  షాప్ కి , వైన్ షాప్ కి మధ్య తేడా ఎందిరా?

లింగం:  ఏమి లేదురా.. ప్రేమ కాఫీ షాప్ లో స్టార్ట్ అవుతుంది ....వైన్ షాప్ లో ముగిసిపోతుంది...

29 Dec 2012

పెళ్ళికి ముందు అంత పని చేస్తావా?


రంగి
: ఏమండి మీకు ఒక విషయం చెప్తాను...ఏమి అనవద్దు..
రంగడు : సరే ..చెప్పు.

రంగి: నేనిప్పుడు గర్భవతిని...
రంగడు : ఇంత ఆనందమైన విషయానికి ఎవరైనా ఏమైనా  అంటారా ?

రంగి: పెళ్ళికి ముందు మా నానకు ఇలానే చెప్తే ....చావ గొట్టాడు..


28 Dec 2012

మీకు లేని సిగ్గు నాకెందుకు..



జడ్జి :  ఇది మూడోసారి కోర్టుకు రావటం..ఇన్నిసార్లు వస్తుంటే సిగ్గుగా అనిపించటం లేదా?

రంగం: మీరు రోజు కోర్టుకు వస్తారు...మీకు లేని సిగ్గు నాకెందుకు..సార్ !

27 Dec 2012

నా భార్యను చుడాగానే...అందరు ఆ ....అని నోరు తెరుస్తారు తెలుసా ?


రంగడు
: నా భార్యను చుడాగానే...అందరు
ఆ ....అని నోరు తెరుస్తారు తెలుసా ?

లింగం : అబ్బో ..అంత అందంగా ఉంటుందా ?

రంగడు : కాదు.... నా భార్య  (పళ్ళ డాక్టర్) డెంటిస్ట్.

26 Dec 2012

గర్ల్ T -SHIRT పైన ఇలా ఎందుకు రాసి వుంది...


గర్ల్ T -SHIRT  పైన ఒక INTRESTING వాక్యం రాసి వుంది...

అది  ఏంటంటే...

Excuse me !
MY Face is above. ;-) 

25 Dec 2012

నెలకు కాదు... రోజుకు 15 నుండి 20 సార్లు చేస్తాను...తెలుసా?


రసిక : నువ్వు నెలకు ఎన్ని సార్లు షేవ్ చెసుకుంటావ్ ?
రంగడు : నెలకు కాదు... రోజుకు 15 నుండి 20 సార్లు చేస్తాను...
రసిక : పాగల్ గానివా ఏందీ ?
రంగడు : కాదు ...మంగలోన్ని...

24 Dec 2012

నేను, నీ భార్య అడ్డంగా దొరికిపోయాం..బాబు...

రంగడు:  అరే లింగం...నా భార్య సత్యవతి ..అంటూ పరిచయం చేస్తాడు.
లింగం : నాకు ముందే తెలుసురా....మీ భార్య ..
రంగడు : ఎలా?
లింగం: ఒకసారి...పడుకున్నప్పుడు అడ్డంగా దొరికిపోయామురా...
రంగడు: ఏమి మాట్లాడుతున్నావు ...దిమాక్ కారబైందా ...

లింగం : నెగటివ్ గా ఎందుకు  ఆలోచిస్తావ్....9వ తరగతిలో క్లాసు జరిగే టైములో క్లాసు వినకుండా నిద్రపోయం రా బాబు...అలా దొరికిపోయాం అంతే!!

22 Dec 2012

వచ్చిన తర్వాతే... ఆ...పని ఓకేనా?

కొడుకు : నాకు చిన్ని పాప కావాలమ్మ?

తల్లి : నాన STATES లో ఉన్నాడు కదా...వచ్చిన తర్వాత  మీ నాన తో ఈ విషయం  గురుంచి చెబుతాను కన్నా...

కొడుకు : ఎందుకు అమ్మ ఆగటం...నానా కు SURPRISE ఇవ్వచ్చు కదా!!

తల్లి : ఆ.....

21 Dec 2012

నేను నిన్న రేప్ (RAPE ) నుండి ఒక అమ్మాయి ని కాపాడాను తెలుసా ?


రంగడు
: నేను నిన్న రేప్ (RAPE ) నుండి ఒక అమ్మాయి ని కాపాడాను తెలుసా ?

లింగం: గుడ్... ఎలా?

రంగడు: Self Control ..... బాబు...నేనే  చేయాలనుకున్న..కంట్రోల్  చేసుకున్నా..

20 Dec 2012

అబ్బో... మొదలు పెట్టింది ఎవరమ్మ?

టీచర్ : పిల్లలు మీరు ఫైనల్ ఎగ్జామ్స్ లో 80% మార్కులతో పాస్ కావాలి.. ఓకేనా?

పిల్లలు : మేము 100% మార్కులతో పాస్ కావడానికి  ప్రయత్నిస్తున్నాం...టీచర్.

టీచర్: ఆహా...ఏమైనా జోక్ చేస్తున్నారా...?

పిల్లలు: జోక్ మొదలుపెట్టింది ...మీరా?మేమా ? చెప్పండి టీచర్.. నిజంగా..?


19 Dec 2012

అబ్బా...ఊరుకోండి ...


రంగి
     :  అబ్బా...ఎందుకండీ...నా మెదడును తింటారు?

రంగడు :  ఓహో ...ఊరుకో...ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు.
              లేని మెదడును ఎలా తింటారు, నీవే చెప్పు... 

18 Dec 2012

ఆడవారికి HEART ATTACKS రావటం చాల తక్కువ...ఎందుకో...?


ఆడవారికి HEART ATTACKS రావటం చాల తక్కువ...ఎందుకో...?

షాపింగ్ చేసే వారికి  HEART ATTACK  ఎందుకు ఎక్కువ  వస్తుంది...

బిల్ కట్టే వారికే ఎక్కువ వస్తుంది...నిజమే కదా .

17 Dec 2012

భార్య తప్పిపోయిందా ? నిజమా ?


రంగడు : సార్ నా భార్య తప్పిపోయిందండి...

పోస్ట్ మాస్టర్ : భార్య తప్పిపోతే ...పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్
ఇవ్వాలి..కానీ పోస్ట్ ఆఫీసు వస్తే ఎలా?

రంగడుజుట్టు పిక్కుంటూ....తట్టుకోలేని ఆనందం లో... ఏమి చేస్తున్నానో నాకే తెలవటం లేదు!! 

15 Dec 2012

దానికి ఒప్పుకుంటావా లేదా? లేదంటే..

టైగర్ ని పటుకోవడానికి...3 దారులు.

1. న్యూటన్ మెథడ్ ప్రకారం...
 మనమే  టైగర్ దగ్గరికి వెళ్లి... అది మన దగ్గరికి వచ్చే సరికి ముందే వేసిన ప్లాన్ ప్రకారం... టైగర్ ని పటుకోవడం.

2. ఎనిస్టీన్ Einsteins మెథడ్ ప్రకారం ...
పులి అలిసి పోయే వరకు వెంటాడి...వెంటాడి అపుడు పటుకోవడం.

3. పోలీస్ మెథడ్ ప్రకారం...
పిల్లిని దొరకపట్టి ... అది పులి అని ఒప్పుకొనే  వరకు దాన్ని చిత్రహింసలు  పెట్టటం.

14 Dec 2012

కొత్త సిమ్ కార్డ్ కొంపముంచిందిరో..

రంగి కొత్త సిమ్ కార్డ్  కొంటుంది.... రంగన్ని  SURPRISE
చెయ్యాలని కిచెన్ లోకి వెళ్లి ఎవరు కాల్ చేస్తున్నారో 
తెలయకుండా ఉండటానికి.. మూతికి బట్ట కటుకొని
రంగనికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి  హాయ్  డార్లింగ్ ..... అంటుంది .
అప్పుడు మన పెద్దన్నఏమి ఆన్సర్ ఇస్తాడంటే...

నేను నీకు తర్వాత చేస్తాను...
మా ఇంటి దయ్యం కిచెన్ లోనే  ఉంది.
bye 
అంటాడు ..


తర్వాత ఏమి జరిగింది...
ఇంకేముంది రంగం పని గోవిందా ... గోవిందా ...  

13 Dec 2012

GOOGLE ఆడా ? మగా ?


నాకో డౌట్ రా రంగ...GOOGLE 
ఆడా  ? మగా  ?

ఆడదేరా...బాబు...

ఎందుకంటే.. వాక్యాన్ని (SENTENCE ) పూర్తి  చేయకముందే..

SUGGESTIONS, GUESSING
లు మొదలు పెట్టి చస్తుంది కదా.

12 Dec 2012

వాడు అసలు టచ్ చేయడు... డోంట్ వర్రీ ...

రంగి : ఏమండి మనబ్బాయి...ఎక్కడ డబ్బులు పెట్టిన దొంగలిస్తున్నాడు....ఏమి  చేయాలో అర్థం కావట్లేదు..

రంగడు :  దానికి ఎందుకంత ఆలోచించటం ... వాని TEXTBOOK  లో డబ్బులు పెట్టు... వాడు బుక్ ని ఓపెన్ చేసి చస్తే కదా... దొంగలించటానికి....

రంగి : బాగుంది  ఐడియా..  మీ అమ్మ కూడా  మీ చిన్నప్పుడు  ఇలానే చేసేది అనుకుంటా...అందుకే  అ  అనుభవం ఇప్పుడు పనికి వచ్చింది ...

రంగడు :  ఆపుతావా...నీ సొల్లు ని. 

11 Dec 2012

నా పెళ్ళాం అనిపించుకున్నావ్ పో ...

jokes

రంగడు :  పెళ్లైన కొత్తలో కోక్ బాటిల్ లాగా ఉండేదానివి...కదా.

రంగి     :   ఇప్పుడు కూడా కోక్ బాటిల్ లాగానే ఉన్నాను..కాని అప్పుడు
               300ml  సైజులో... ఇప్పుడు 1.5లీటర్  సైజులో అంతే కదా ..

రంగడు :   ఆ...హా  ఎంత బాగా సమర్దించుకున్నవే ...రంగి...నా పెళ్ళాం
               అనిపించుకున్నావ్ పో ...

10 Dec 2012

WOMEN స్పెల్లింగ్ 'W ' తో ఎందుకు స్టార్ట్ అవుతుందో తెలుసా?

WOMEN స్పెల్లింగ్ 'W ' తో ఎందుకు  స్టార్ట్ అవుతుందో తెలుసా?
ఎందుకంటే ... అన్ని QUESTIONS 'W ' తో..నే స్టార్ట్ కావటం వల్ల...
ఎలా అంటే ...
who
why
what
when
which
whom
where
wife…?

8 Dec 2012

లవ్ మ్యారేజ్ బెట్టరా? అరెంజ్ మ్యారేజ్ బెట్టరా?



రంగడు
      : లవ్ మ్యారేజ్  బెట్టరా? అరెంజ్ మ్యారేజ్ బెట్టరా?
శంకరయ్యనీ అయ్యా ...నీవు అడిగేది ...
                 SUICIDE బెట్టరా? MURDER బెట్టరా?
                 అన్నట్టు ఉంది.

7 Dec 2012

సరదా సంభాషణ...దేవునితో.

 రంగడు: వేల సంవత్సరాలు మీ దృష్టి  లో .....?
 దేవుడు: ఒక నిమిషం తో... సమానం.
 రంగడు: అవునా...వేల కోట్లు మీకు ఎంతటితో  తో సమానం ?
 దేవుడు:  ఒక పైసా...తో సమానం.
 రంగడు: నాకు ఒక పైసా ఇవ్వచ్చు కదా !
 దేవుడు:  తప్పకుండా....ఒక నిమిషం ఆగండి...

6 Dec 2012

మీ భార్య పుట్టినరోజు... చిటుక ఏంటి?



ప్రశ్న :   మీ  భార్య పుట్టినరోజును  మర్చిపోకుండా
            ఉండటానికి  అద్బుతమైన చిటుక ఏంటి?

జవాబు : సింపుల్ ...ఒకసారి మర్చిపోండి... 
              ఇక జీవితాంతం  మర్చిపోలేరు...

5 Dec 2012

నల్లిపిత్తులదానా..ఇంతపని చేస్తావా?


రంగడు : నేను తిట్టినా..  నీవు  అసలు తిరిగి ఏమి అనవేంటి?
             కోపాన్ని ఎలా అపుకుంటావు?
రంగి :     నేను టాయిలెట్ ని క్లీన్ చేస్తాను..
రంగడు:   అదెలా నీకు హెల్ప్ చేస్తుంది ?

రంగి:      క్లీన్ చేసేది ...నీ టూత్ బ్రష్ తోనే కాబట్టి ...

4 Dec 2012

నీకిది నిజంగా ఫస్ట్ నైటా...


శోభనం రోజు భర్త , భార్యతో ...

నీకిది నిజంగా  ఫస్ట్  నైటా.. అని అడుగుతాడు..
అప్పుడు భార్య...ఏమంటుందంటే...
 

No... No... actually it is first time at night! 


1 Dec 2012

పెళ్లిచేసుకుంటావా?



రంగి
: నేను చనిపోతే ఏమిచేస్తావు ?
రంగడు : పిచ్చోన్ని అయిపోతాను...
రంగి: నేను చనిపోయిన తర్వాత పెళ్లిచేసుకుంటావా?
రంగడు : పిచ్చోడు ఏమైనా చెయ్యచ్చు...చెప్పలేం .....!

23 Nov 2012

నడుముని ప్రెస్ చేస్తాను తెలుసా?

kiss
రంగడు: నేను  రోజు ఆఫీసుకి వెళ్లే ముందు నా భార్యని ముద్దు పెట్టుకొని..నడుముని ప్రెస్ చేస్తాను తెలుసా? మరి నీ   గురుంచి...ఏంటిరా ?

లింగం మామ: నీవు ఆఫీస్ కు  వెళ్ళిపోయి..తిరిగివచ్చే ఆద గంట ముందు వరకు  నా పని కూడా అదేరా రంగా..

రంగడు: అరేయ్..సాలే గా ...

ఒకసారి క్లింటన్ మామ..

curd
ఒకసారి క్లింటన్ మామ ఇండియన్ హోటల్ కి వచ్చినప్పుడు..సర్వర్ ఫ్రెష్ పెరుగు ని ఇస్తాడు .అప్పుడు క్లింటన్ మామ సర్వర్ ని  ఇదేంటి ఎలా తయారవుతుంది అని అడుగుతాడు..అప్పుడు మన సర్వర్ రంగడు ఏమని ఆన్సర్ ఇస్తాడంటే..." పాలు కొద్దిగా పెరుగుతో రాత్రి పడుకుంటది సార్.... పొద్దున్నే  టైట్ గా ఫ్రెష్ గా తయారవుతది  సార్  అంటడు. అప్పుడు క్లింటన్ మామ రంగన్ని పిలిచి...రాత్రి పాలు, పెరుగు  ఏమి చేసుకుంటాయాని...మెల్లిగా అడుగుతాడు? అప్పుడు మనోడు చెవిలో మెల్లిగా...మీకు తెలుసు సార్.....మీరు,లుయినేస్కి...అప్పుడు క్లింటన్ మామ ...yes.. yes i got Ur పాయింట్.  

దిమ్మదిరిగే ఆన్సర్...


రంగడు వంటగది లోకి వెళుతున్నాడు ...వస్తున్నాడు..అలా పదిసార్లు చేసేసరికి రంగి కి అనుమానం వచ్చి...ఏంటండి అలా వంటగదిలోకి ఎన్నిసార్లు వెళ్లి వస్తారండి అని అడిగితే..మన రంగడు దిమ్మదిరిగే ఆన్సర్ ఇస్తాడు ..ఏంటంటే..నాకు షుగర్ వుంది కదే ...డాక్టర్ ని కలిస్తే ... మీరు అప్పుడప్పుడు...షుగర్ చెక్ చేసుకోమని  చెప్పాడులేవే... అంటాడు....రంగడు. అప్పుడు  రంగి మనసులో "ఆహా ఏం సోల్లుగానివి రా బాబు " అనుకుంటది.

మా ఆయన మీద మీద డౌట్...

రంగి:   నాకెందుకో   మా ఆయన మీద  డౌట్ వచ్చిచస్తుందే..

పక్కింటిది:  ఎందుకే ?

రంగి:  మా పనిమనిషి ఎప్పుడు నన్ను అమ్మ..అమ్మ  అని పిలిచేది..
రెండు రోజుల నుండి అక్క..అక్క...అని పిలుస్తుందే తల్లీ..   
    
పక్కింటిది: వోయామ్మో ఇక నీ బతుకేట్లనే... అని ఇంకా అగ్గి పెట్టింది...

14 Nov 2012

అసలు satisfy చేయటం లేదండి...

Judge : విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు?

రంగడు : నన్ను అసలు satisfy చేయటం లేదండి..

Judge : ఇదినిజమా?  మేడం..?    
  

 రంగి  
: డామిట్! నా వల్ల కాలనీ అంతా హ్యాపీ గా వుంది...                    వీనికేమి వచ్చిందో రోగం ...


ఇదిఎక్కడి...MANAGEMENT...

ఒక బిచ్చగానికి 100 Rs దొరుకుతాయి.
100 Rs తీసుకొని 5 స్టార్ హోటల్ కి వెళ్లి డిన్నర్ చేస్తాడు.
బిల్ ఏమో 2000 వేలు దాటిపోతుంది....బిల్ కట్టలేకపోతాడు...
మేనేజర్ అ బిచ్చగాన్ని పోలీసులకు అప్పచెబుతాడు...!!!
సింపుల్ గా అ బిచ్చగాడు...పోలీస్ కి 100 Rs ఇచ్చేసి జంప్...

దీనినే కొత్తగా "FINANCIAL MANAGEMENT without MBA " అంటారా...? 
    

13 Nov 2012

పెళ్ళికి ముందు...పెళ్ళి తర్వాత..

పెళ్ళికి ముందు...పెళ్ళి   తర్వాత  BOYS రూమ్ లో ఏముంటాయి?

పెళ్ళికి ముందు...
Perfumes, BF CDS, చేతిలో రిమోట్.

పెళ్ళి   తర్వాత...
లోన్  పేపర్స్ . UNPAID BILLS. పెయిన్ కిల్లర్స్.
షాపింగ్ లిస్టు .



30 Oct 2012

మన హీరోలు....EXAMS.

Cinema Joke







మన
హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు. వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు.
పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు
ఏంటి బాబు లేట్ అంటే
..

మహేష్: ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి
కూర్చున్నాడు. (వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు
మహేష్ థాంక్స్ చెబితే)

చిరంజీవి: థాంక్స్ కాదు బ్రదర్ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు,
ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లు మాయం  చేయండి.
(
అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని)

రామ్ చరణ్: ఒక్కొకటి కాదు నాన్న, వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300
వందలమందికి పంచుతా.. (అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్ వచ్చి)

సాయికుమార్: కనిపించే మూడు పేపర్లు .. OMR  పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్
పేపర్ అయితే కనిపించని నాలుగో పేపరేరా స్లిప్...స్లిప్...స్లిప్.
(
అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు.)

స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ...

బాలకృష్ణ: ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే.... ప్రశ్నకి జవాబు
రాసానో కనుక్కోవడానికి వారం పడుతుంది . మర్యాదగా ప్రశ్నకు స్లిప్పో సరిగ్గా చెప్పండి.

మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్

ప్రభాస్: వాడు పొతే వీడు, వీడు పొతే నేను, నేను పొతే నా అమ్మామొగుడు అని
ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే ... దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి
అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు.

యన్.టి.ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు
లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని...

జూ|| యన్.టి.ఆర్ : రేయ్... సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో
...
లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పు వదల్లేదో ..... రచ్చ..రచ్చే..!
(
అన్నాడు. లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు
పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా...అని అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన
వచ్చాడు రవితేజ )

రవితేజ: ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా మీ డౌట్ .... నేనే...ఇచ్చా...!
ఊరికినే కాపీ కొడితే.... కిక్ ఏముంది నా బొంగు.. అందుకే స్క్వాడ్ ను పిలిచా..!
అని అక్కడి నుండి పరిగెత్తాడు. పట్టుకోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన
అందరు..

JUST FOR FUN  అంతే.... please don't take it seriously...