30 Oct 2012

మన హీరోలు....EXAMS.

Cinema Joke







మన
హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు. వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు.
పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు
ఏంటి బాబు లేట్ అంటే
..

మహేష్: ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి
కూర్చున్నాడు. (వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు
మహేష్ థాంక్స్ చెబితే)

చిరంజీవి: థాంక్స్ కాదు బ్రదర్ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు,
ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లు మాయం  చేయండి.
(
అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని)

రామ్ చరణ్: ఒక్కొకటి కాదు నాన్న, వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300
వందలమందికి పంచుతా.. (అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్ వచ్చి)

సాయికుమార్: కనిపించే మూడు పేపర్లు .. OMR  పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్
పేపర్ అయితే కనిపించని నాలుగో పేపరేరా స్లిప్...స్లిప్...స్లిప్.
(
అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు.)

స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ...

బాలకృష్ణ: ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే.... ప్రశ్నకి జవాబు
రాసానో కనుక్కోవడానికి వారం పడుతుంది . మర్యాదగా ప్రశ్నకు స్లిప్పో సరిగ్గా చెప్పండి.

మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్

ప్రభాస్: వాడు పొతే వీడు, వీడు పొతే నేను, నేను పొతే నా అమ్మామొగుడు అని
ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే ... దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి
అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు.

యన్.టి.ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు
లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని...

జూ|| యన్.టి.ఆర్ : రేయ్... సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో
...
లోపల ఒరిజినల్ అలాగే ఉంది. స్లిప్పు వదల్లేదో ..... రచ్చ..రచ్చే..!
(
అన్నాడు. లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు
పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా...అని అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన
వచ్చాడు రవితేజ )

రవితేజ: ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా మీ డౌట్ .... నేనే...ఇచ్చా...!
ఊరికినే కాపీ కొడితే.... కిక్ ఏముంది నా బొంగు.. అందుకే స్క్వాడ్ ను పిలిచా..!
అని అక్కడి నుండి పరిగెత్తాడు. పట్టుకోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన
అందరు..

JUST FOR FUN  అంతే.... please don't take it seriously...

29 Oct 2012

ఏడ్చి చస్తున్నావ్ ....


బస్సు ఆక్సిడెంట్ లో చేయి విరిగి ఒకతను ఏడుస్తూ వుంటాడు...
అంతలో... ఒక తిక్కలోడు వచ్చి నీ అయ్యా...
చచ్చినోడే సైలెంట్ గా వున్నడు ...
నువ్వు ఏమిరా... ఏడ్చి చస్తున్నావ్..... నీ .....

పాగల్ గానివా ఏందీ ?


రసిక : నువ్వు నెలకు ఎన్ని సార్లు షేవ్ చెసుకుంటావ్ ?
రంగడు : నెలకు కాదు... రోజుకు 15 నుండి 20 సార్లు చేస్తాను...
రసిక : పాగల్ గానివా ఏందీ ?
రంగడు : కాదు ...మంగలోన్ని...

ఇంత లేటుగా..


తండ్రి
- స్కూల్ నుండి ఇంత లేటుగా వచ్చావేం.
కొడుకు- మా సార్ నిద్రపోయాడు.
తండ్రి- మరి సార్ నిద్రపోతే నీకెందుకాలస్యమైంది
కొడుకు - ఆయన నిద్రలేచాక నన్ను లేపాడు.

23 Oct 2012

ప్రభుత్వం పని తీరు ఇలా వుంటుందా ?

ఓ ప్రాంతంలో దొంగలు ఎక్కువగా పడుతున్నారని వార్తలొచ్చాయి. గస్తీ కోసం WATCHMEN    ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • మరి WATCHMEN కు   ఉండాల్సిన అర్హత లేమిటి? పని గంటలెన్ని? ఇత్యాది విధి విధానాలు ఖరారు చేసేందుకు ఒక కమిటి ని  వేశారు

  • ఇక WATCHMEN తన విధి  సరిగా  నిర్వహిస్తున్నాడని ఎలా తెలియాలి? అందుకని ఒక superviser ని నియమించారు.

  • మరి వీళ్ళిద్దరికీ వేతనాలు ఇవ్వాలి కదా? ఓ  క్లర్క్  మరియు టైం కీపర్ నూ పెట్టారు.

  • ఇంతమందిని పర్యవేక్షించాలాంటే ఎలా? ఓ ఆఫీసర్ ని నియమించారు.

  • ఆ ఆఫీసర్కి ఒక సెక్రటరి , ఒక boy......

  • ........

తీరా చూసేసరికి బడ్జెట్  విపరీతంగా పెరిగి పోయింది. ఉద్యాగాల్లో కోత విధించాలన్న ఉత్తర్వుల మేరకు WATCHMEN ను తొలగించారు.

డాక్టర్ గారూ...


"డాక్టర్ గారూ... నేను  చాలా పేద వాడినండీ.... మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. ఎలాగైనా  నాకు వైద్యం చేయండి బాబూ... కానీ జీవితాంతం నేను పైసా తీసుకోకుండా మీ కుటుంబం అంతటికీ పని చేసి పెడతాను"  అన్నాడా వ్యక్తి.

"సరే... ఇంతకూ నువ్వేం పని చేస్తుంటావు?" అడిగాడు డాక్టర్.

"కాటికాపరినండీ... శవాలు తగలబెడుతుంటాను" అన్నాడతను.

19 Oct 2012

నాకూ విడాకులు కావాలి..



లేడీ : లాయర్ గారూ ! నాకూ విడాకులు కావాలి .
లాయర్: మీ అయన కబడ్డీ చాంపియన్ కదా. ఏంటి ప్రాబ్లం?
లేడీ : ఏముంది జస్ట్ ....."టచ్" చేసి పారిపోతున్నాడు.....