30 Dec 2013

నా చావును చీరతో పోల్చిందిరా....

doctor jokes, jokes

రంగి: గుండె పోటు వస్తే వెంటనే  తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్ ?
డాక్టర్: ఎందుకలా అడుగుతున్నారు ?

రంగి: 20 వేల తో చీర కొన్నాను. దాన్ని మా ఆయనకు చూపించే ముందు
ప్రథమ చికిత్స గురుంచి తెలుసుకుంటే మంచిదని. 

28 Dec 2013

చిలిపితనం...చాలా ఎక్కువైందే నీకు....

wife jokes, telugu jokes, jokes

రంగడు: కోతి బొమ్మ గీసి నా వైపు అలా ఎందుకు చూస్తున్నావు ?

రంగి: ఒకసారి సరిచూసుకుందామని!
రంగడు: చాలా ఎక్కువైందే.... 

26 Dec 2013

పక్కింటి అమ్మాయి ని లైన్ వేస్తావా?

lovers joke, male jokes, telugu jokes

బ్యాంకులో పనిచేసే రంగడు పక్కింటి అమ్మాయికి " నా ప్రేమ క్రాస్ చేసిన
చెక్కు లాంటిది. అది నీకే  చెందుతుంది అని  లవ్ లెటర్ రాసాడు.

దానికి బదులుగా కరెంటు డిపార్టుమెంటు లో పని చేసే రంగి  
"నా ప్రేమ  ట్యూబ్ లైట్ లాంటిది . మా నాన స్విచ్ వేస్తే  తప్ప వెలగదు అది" 
అని బదులు.

24 Dec 2013

పెళ్ళికి తొందరెందుకు...

wife jokes, telugu jokes


రంగడు: మన అమ్మాయిని మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలి.
రంగి: చాలా  మంచి ఆలోచన... మా నాన్నలా తొందర పడకుండా...!

22 Dec 2013

నీ అమ్మ పోలికలు వస్తే ఎవడు ఏమి చేస్తాడు?

father and son jokes, jokes, telugu jokes

రంగడు: సైకిల్ అంత లేవు...నీకు సైకిల్ కావాలా ?
చిన్ను: మీకు కారు  వుంది కదా.. మీరు దానంత బరువున్నారా?
రంగడు: నీకన్నీ.. నీ అమ్మ పోలికలే...


 

20 Dec 2013

ఇంతకీ ఏ బుక్ తెరుస్తావో? ఏం చూస్తావో ?

facebook jokes, telugu jokes, jokes


రంగడు(టీచర్): అరెయ్... చిన్ను ఇంటికి వెళ్లి ఏమి చేస్తావు ?
చిన్ను(స్టూడెంట్): రెండు గంటలు ఆడుకొని తర్వాత బుక్ తెరుస్తా..
రంగడు(టీచర్): వేరి గుడ్... ఇంతకీ ఏ బుక్ తెరుస్తావో? 
చిన్ను(స్టూడెంట్): పేస్ బుక్ !!!!


18 Dec 2013

నా భార్య నా కోసం వ్రతమా ............?

wife and husband jokes, telugu jokes

రంగి: నేను మీ సంతోషం కోసం వ్రతం చేయాలనుకుంటున్నాను...
రంగడు: మౌన వ్రతం చెయ్యు... చేసే టైం లో అయినా ప్రశాంతంగా ఉండొచ్చు.

16 Dec 2013

ఆ డౌట్ ఇంకా అర్థం కావటం లేదండీ...

teacher jokes, telugu jokes

రంగడు(టీచర్): మనం టూర్ కు వెళ్ళినపుడు ఆలయాన్ని
చూసాం కదా.. ఎవైన డౌట్స్ ఉంటే అడగండి పిల్లలు.

చిన్ను(స్టూడెంట్): "పూజారి తీర్థం మూడు సార్లు ఇచ్చి
ప్రసాదం మాత్రం ఒక్కసారే ఎందుకు ఇచ్చారో ఇంకా అర్థం కాలేదు టీచర్... "

రంగడు(టీచర్): నీ డౌట్.. తగలెయ్య... 

14 Dec 2013

ఛీ... నీకన్నా అదే నయం రా ..

dog jokes, telugu jokes

చిన్ను : అరేయ్... నీకు  ఈత వస్తుందా ?
మిన్ను: రాదురా..
చిన్ను: ఛీ... నీకన్నా కుక్క నయం రా .. ఎంత బాగా ఈదుతుందో..
మిన్ను: అది సరే ... ఇంతకూ నీకు ఈత వచ్చా ?
చిన్ను: చాలా బాగా వచ్చు.

మిన్ను: అయితే... నీకు కుక్కకు తేడా లేదన్న మాట! 

12 Dec 2013

భార్య, భర్త మధ్య చిలిపి తనం అంటే ఇదేనా ...

couple jokes, telugu jokes, silly jokes
రంగి: మనం లాస్ట్ ఇయర్ కారులో నాగపూర్ వెళ్ళాం... గుర్తుందా ?
రంగడు: ఆ... గుర్తురావటం లేదే...
రంగి : అదేనండీ... మన కుక్కను విండో పక్కకు కుర్చోపెట్టాను..
అదే టైం లో మీరు కూడా కుక్కపక్క...తల పెట్టారు...
అప్పుడు అందరూ ...ట్విన్స్ ...ట్విన్స్  అన్నారు ...

రంగడు: దిక్కుమాలిన దానా... గుర్తురావటానికి అంత  ఘోరమైన example చెప్పాలా?


10 Dec 2013

ప్రపంచంలో పెద్ద జోక్ ఏంటో తెలుసా..?

telugu jokes, silly jokes

ప్రపంచంలో పెద్ద జోక్ ఏంటో తెలుసా..?

Girl Friend pays the bill.

 

8 Dec 2013

నీకు ఇప్పుడే... ముదిరిపోయిందిరా....

elephant, telugu jokes

రంగి(టీచర్) : ఏనుగు  పెద్దదా ? చీమ పెద్దదా ?
స్టూడెంట్ (స్టూడెంట్) : ఏందీ.. టీచర్.. పుట్టిన రోజు చెప్పకుండా అది పెద్దా ... ఇది పెద్దా... అంటే ఏమి చెప్పాలి..
రంగి(టీచర్): అబ్బో ... నీ వంకాయ ముదిరింది రో....


6 Dec 2013

పక్కింటి అమ్మాయి ని చూడురా...

girlfriend jokes, telugu jokes, jokes


రంగడు: పక్కింటి అమ్మాయి ని చూడురా... 1st క్లాస్ లో పాస్ అయింది.
చిన్ను: అలా... చూడటం వల్లే నేను ఫెయిల్ అయింది...

4 Dec 2013

జాగ్రత్తగా... స్టెప్ బై స్టెప్ చూడండి...

angry, teugu jokes,  jokes

జాగ్రత్తగా... స్టెప్ బై స్టెప్ చూడండి...

1+1=2+2=4+4=8-3=5+2=7-3=4-1=3+6=9-5=4
+4=8-5=3-2=1+5=6+2=8-7=1-1=0 

కోపం వచ్చింది కదా!
చచ్చినోడు...నాకు ఇలానే పంపాడు .

2 Dec 2013

వారేవా.. రజినీకాంత్...

rajinikanth, jokes, telugu jokes, silly jokes
భాషా :
ఒక సబ్జెక్టు చదివితే.. అన్ని సబ్జెక్ట్స్ చదివినట్టే..

శివాజి: నానా పందులే... ఇప్పుడే చదువుతాయి ...
సింహం exam రోజు మాత్రమే  చదువుతుంది...

అరుణాచలం : ఆ గురువు భోదిస్తాడు... ఈ  అరుణాచలం విని వదిలేస్తాడు...

1 Dec 2013

ఎవరితో ఉంటే అది పోయేకాలం......... ?

lover jokes, jokes, telugu jokes


గొడుగు తో ఉంటే.. అది వానకాలం.
కూలర్ తో ఉంటే.. అది  ఎండకాలం.
స్వెట్టర్ లో ఉంటే .. అది చలికాలం .

లవర్ తో ఉంటే అది పోయేకాలం... 


29 Nov 2013

పరవాలేదు... అలానే వచ్చేయ్ ..Please


రంగడు: రంగి తో ...  ఇటు రా రంగి.. ఇటు రావే...  రంగి అంటాడు..
రంగి: నా చెప్పు తీయమంటావా ?
రంగడు: పరవాలేదు... అలానే వచ్చేయ్ .. ఇక్కడ గుడి లేదు, గోపురం లేదు...

27 Nov 2013

కింద, మీద ఏందిరా... నీ అబ్బ ...

teacher jokes, jokes


రంగడు: భాదకు, భయానికి తేడా ఏందిరా  చిన్ను?
చిన్ను : భాద అంటే మీద తడుస్తది, భయం అంటే కింద తడుస్తది. 

25 Nov 2013

మనకు ఒక చోటు వుంది... వస్తావా?

wife, wife jokes, telugu jokes, silly jokes, jokes

రంగి:  ఏమండీ... ఈ వారం మొత్తం సినిమాలు చుద్దాం.. 
ఆ తర్వాత వారం షాపింగ్ చేద్దాం... సరేనా..
రంగడు: ఆ తర్వాత వారం టెంపుల్ కు వెళదాం...

రంగి: ఎందుకండీ ?
రంగడు: బిచ్చం అడుక్కోటానికి .... 

23 Nov 2013

ఏంటి అలా... సైలెంట్ గా కూర్చొని వుంది?

telugu jokes, silly jokes, jokes

రంగడు: ఏంట్రా చిన్ను.. అమ్మ అలా సైలెంట్ గా కూర్చొని వుంది?
చిన్ను: ఏమి లేదు... అమ్మ నన్ను లిపిస్టిక్ అడిగింది.. ఫెవిస్టిక్ ఇచ్చానంతే.. 

రంగడు: ఎన్నాళ్ళకు మంచి పని చేసావురా.. చిన్ను.. 


21 Nov 2013

ఎన్ని సార్లు చెప్పాలి... అక్కడ చేయద్దు అని చెబుతున్నాను కదా!

fridge, jokes, telugu jokes

చిన్ను: అమ్మ, నిన్న టాయిలెట్ కి బాత్రూం కి వెళ్ళినపుడు,
డోర్ ఓపెన్ చేస్తే ... లైట్ అదే ఆన్ అయింది.

రంగి(అమ్మ ):  ఒరేయ్.. వెధవ నీకు ఎన్ని సార్లు చెప్పాలిరా...
fridge లో టాయిలెట్ కి వెళ్ళద్దు అని ...

19 Nov 2013

మనిషిని పక్షిలా నీ మామ మారుస్తాడా?

pomangranate, tree, fruit,telugu jokes, silly jokes

రంగడు(టీచర్) : అరేయ్ చిన్ను... నది లో దానిమ్మ చెట్టు ఉంటె ..
పళ్ళు ఎలా తెంపుతావో చెప్పు ..
చిన్ను (స్టూడెంట్ ) : పక్షి లా మారి... ఎగిరి వెళ్లి తెంపుకు వస్తా..

రంగడు(టీచర్) : మనిషి ని పక్షిలా నీ మామ మారుస్తాడా?
చిన్ను (స్టూడెంట్ ) : మరి నది లో దానిమ్మ చెట్టు నీ అయ్యా పెడతాడా.. 

రంగడు(టీచర్) : షాక్ ..............


17 Nov 2013

గర్ల్స్ కు TUTION చెబుతావా?

school, telugu jokes, jokes, silly jokes

చిన్ను: నేను స్కూల్ కి వెళ్ళను...
రంగి: ఎందుకురా ?
చిన్ను: పని చేస్తాను.

రంగి: 5th క్లాసు చదివి ఏ పని చేస్తావురా?

చిన్ను: 4th క్లాసు గర్ల్స్ కు TUTION  చెబుతా  అమ్మ... 

15 Nov 2013

అరేయ్... పులికి, మేక కు తేడా ఏంటిరా ?

telugu jokes, jokes, silly jokes


రంగడు: అరేయ్... పులికి, మేక కు తేడా ఏంటిరా ?
సోమిగాడు: పులి క్రూర జంతువు, మేక కూర జంతువు.

13 Nov 2013

ఓరి నీ అయ్య... ఇదేమి ఉద్యోగం రా బాబు..


రంగడు:: IDEA లో జాబు ఉంది చేస్తావా ?
సోమిగాడు: చేస్తా ... జాబు ఎక్కడ?
రంగడు: హైదరాబాద్ లో ... 30,000/- ల జీతం.
సోమిగాడు: రేపే వచ్చేస్తున్నాను... అసలు నేను ఏ పని చేయాలి?

రంగడు: ఏమి లేదురా... IDEA టవర్ ఎక్కి..  AIRTEL సిగ్నల్స్ ఆపాలంతే.. 

సోమిగాడు: ఓరి నీ అయ్య... ఇదేమి జాబు రా బాబు.. 
రంగడు : మరి వూరికే... వేలకు వేలు ఇస్తారనుకున్నావా ?
 

11 Nov 2013

అసలు విషయం తెలిసిందా?



రంగడు: నీకు కష్టం వచ్చిన... నష్టం వచ్చిన... సుఖం వచ్చిన.... నాతో పంచుకో.
సోమిగాడు: నీది ఎంత మంచి మనసురా....

రంగడు: మనసా... బొంగా... నాకు ఇన్ కమింగ్ ఫ్రీ...  హ హ హ. 

9 Nov 2013

పొద్దున్న నాన్న ఇస్తే ... పటుకొని నాలుగు పీకింది.


రంగి : చిన్ను... ఆంటీ కి ముద్దు ఇవ్వు...
చిన్ను: అమ్మో... నేను ఇవ్వను.
రంగి: ఎందుకురా?
చిన్ను: పొద్దున్న నాన్న ఇస్తే ... పటుకొని నాలుగు  పీకింది.
రంగి: నాన్న ఎక్కడ ఉన్నాడు?
చిన్ను:ఎందుకు అమ్మ?
రంగి : ఇంకో నాలుగు పీకడానికి....

7 Nov 2013

సిగ్గుతో చస్తున్నా.... బాబు...


ఆపిల్  ఏడుస్తుంది ....
banana: ఎందుకు ఏడుస్తున్నావు?
ఆపిల్: అందరు నన్ను కోస్తున్నారు...  తినేస్తున్నారు. 

banana: నీవెంతో బెటర్... నాతో పోల్చుకుంటే... 

ఎందుకంటే.. అందరు నా డ్రెస్ తీసేస్తున్నారు...తింటున్నారు... 
సిగ్గుతో చస్తున్నా...

7 Oct 2013

ఎన్ని పార్టీ లు మారుతావు నాయిన...?

jokes, political jokesn, cartoon

రంగి: మీరే స్వంత పార్టీ పెట్టడానికి కారణం ఏమిటి?
రంగడు: మారడానికి మరే పార్టీ  లేదు కదా!

5 Oct 2013

రూపాయి కి ఏమి వస్తుంది... తిండి ఎక్కువ అయిందా?

jokes


బిచ్చగాడు : ఒక్క రూపాయి ఇవ్వండమ్మా....
రంగి: రూపాయి కి ఏమి వస్తుంది...?
బిచ్చగాడు:  బరువు ఎంత పెరిగానో  చుసుకుందామని..

25 Sept 2013

రూపాయి కొరకు... వంగాలా ఏంటి? వదిలెయ్...

jokes, daddy, famili jokes
నానా నేను... రూపాయి  కాయిన్ ను మింగాను...
డాక్టర్ దగ్గరకు వెళదామా ?

రంగడు: పోనీ లేరా... అ డాక్టర్ వంద మింగుతాడు...
అవసరమా?

23 Sept 2013

పెళ్ళికి ముందు..... పెళ్లి తర్వాత?


రంగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు  కదా...  ఎలా వుందిరా నీ లైఫ్?

రంగడు: పెళ్ళికి ముందు మల్లె తీగల వుండేది... పెళ్లి తర్వాత కరెంటు తీగ అయిందిరా ...
 

మాట్లాడితే... అరిచి చస్తుంది....

21 Sept 2013

అంత దానికే కొవ్వు కరిగిందా... డార్లింగ్ !!!!

sex, wife jokes, jokes

రంగి: సైకిల్ కు, కారుకు  తేడా ఏంటి రంగా...

రంగడు: కొవ్వుతో నడిచి, డబ్బులు మిగిల్చేది  సైకిల్ ....,
డబ్బుతో నడిచి కొవ్వును కుడబెట్టేది కారు..

రంగి : నీవు కత్తి  రంగా...


19 Sept 2013

ఒక తియ్యటి ముద్దు ఇవ్వచ్చు కదా డార్లింగ్...




రంగ: ఒక తియ్యటి ముద్దు ఇవ్వచ్చు కదా  డార్లింగ్...
రంగి : వద్దు రంగా ... నీకు  అసలే చక్కర వ్యాధి కదా.. అని జంప్.

17 Sept 2013

పనమ్మాయి పిన్ని...అవుతుందా నీకు !!!


ఏరా ....తలకాయ తిరుగుతుందా? పెద్దా  చిన్నా  లేకుండా
మీ నాన్నను మందలించమని చెబుతున్నావు ఏంట్రా ?

" ఏమి చేయాలి అమ్మ ... పనమ్మాయిని పిన్ని అని
పిలవమంటున్నాడు... "

నీవు వెళ్ళు బాబు... ఏమండీడీడీ.........

13 Sept 2013

ఎందుకు బలవంతం చేస్తున్నారు....చెప్పండి...



మినిస్టర్ : నేను ఏ  ఊరెల్లినా జనం ఓ నాలుగైదు రోజులు ఉండమని
బలవంతం చేస్తున్నారు. నేనంటే  ఎంత ఆభిమానమో...

సెక్రటరి : అది ఆభిమానం కాదు సార్ ...  మీరుంటే కరెంటు కోత  ఉండదని అంతే.


11 Sept 2013

ఆహా...400 కే అలాంటి అవకాశమా? నేను రెడీ !


రంగి : 4000 రూపాయలివ్వండి.  ఆ  పట్టుచీర కొంటా...
రంగడు: నాకు తెలిసిన దుకాణానికి వెళ్దాం.... ఇదే చీర 400 కే  ఇస్తారు.

రంగి: అవునా...  అక్కడే ఇలాంటి పది చీరలు కొనచ్చు. చలో చలో....
రంగడు:నా బొంద.. 


9 Sept 2013

నా నీడలో గడపాలని వుందా... నాతో గడపాలని లేదా?



రంగి: రంగా ... నా జీవితమంతా నీ నీడలో గడపాలని వుంది!
రంగడు : అంటే నేను .. జీవితమంతా ఎండలో నిలబడాలా ... ఏంటి?

6 Sept 2013

మొత్తానికి రాజమౌళి అని అనిపించుకున్నావు రో ...


రంగ .. నీకు ఎప్పుడైనా పులి, సింహం కనిపించింది అనుకో..
నిన్ను ఏది మింగేయాలి అనుకుంటావు ?

అప్పుడు రంగడు .. పులిని సింహం మింగేయాలి అని అనుకుంటాను... 

4 Sept 2013

పొయి... పోయి నా పెళ్ళాం తో అ విషయమా... దేవుడో ...

డాక్టర్: భార్య  ని పరీక్ష చేసిన తర్వాత...
భర్త తో ఇలా అన్నాడు డాక్టర్...
"మీ భార్య కి వినిపించకపోవటానికి కారణం ఏమి లేదు...
వయసు పెరినపుడు ఇవన్ని మామూలే కదా... "
మీరే మీ భార్యకి చెప్పండి అని డాక్టర్ అంటాడు..

అపుడు భర్త .. వామ్మో... అదేదో  మీరే చెప్పండి. నేను చెప్తే
ఇంకా ఏమైనా ఉందా... భూకంపం  వస్తది నాయినో
...


2 Sept 2013

ఎప్పుడు అనటమే కాని..ఆ పని ఎప్పుడైనా చేశావా?


రంగడు: డార్లింగ్  నీ కోసం, నీ ప్రేమ కోసం నన్నేమి చేయమన్న చేస్తాను...
ఏమి కావాలన్న తెస్తాను ... ఆఖరికి చావమన్న చస్తాను ... 
అన్నాడు రంగడు...

రంగి: ఈ మాట ఎప్పుడు అనటమే కాని  ఎప్పుడైనా చేసే
ప్రయత్నం చేశావా? మూతి  తిప్పుకుంటూ అన్నది మరి రంగి.

30 Aug 2013

వాడికన్నీ... నీ పోలికలు వచ్చాయా? నా బొంద!!


రంగడు: వాడికన్నీ నా పోలికలే వచ్చాయి....
కొడుకును చూసి ఆనందపడుతూ అన్నాడు రంగడు..

రంగి: అందుకే  వాడు రోజు నా చేత తిట్లు తింటాడు ... 


28 Aug 2013

భార్యాభర్తలిద్దరు ఒక రేంజ్ కి చేరుకున్నారు...


భార్యాభర్తలిద్దరు తీవ్రంగా గొడవ పడుతున్నారు. అది ఒక రేంజ్ కి చేరుకుంది.


రంగడు : నువ్వు అలాగే అరిచావంటే నాలో ఉన్న పశువు బయటకు వస్తాడు.. ఏమనుకున్నావో..

రంగి : రానీ.. పిల్లికి భయపడేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ..



26 Aug 2013

భగవంతుడివి. అని అనుకుంటున్నారా... మీకెలా తెలిసింది!

wife and husband, jokes, love

రంగడు : నన్ను అందరూ భగవంతుడని అనుకుంటున్నారు.


రంగి : ఆ విషయం నీకు ఎలా తెలిసింది.

రంగడు : నన్ను చూసి అందరూ భగవంతుడా.. మళ్లీ వచ్చావా అంటున్నారు...


23 Aug 2013

ఎవరికీ చెప్పకుండా... బయటకు వెళతావా?

father and son jokes, jokes

రంగడు : నాన్నా... నేను నీ అంత పెద్దవాడిని ఎప్పుడవుతాను...
అమ్మ కి చెప్పకుండా బయటకు వెళ్లడానికి వీలుగా...


పెద్ద రంగడు
(తండ్రి ): నేనే అంత పెద్దవాడ్ని కాలేదు.. నీ గురించి నేనేం చెప్పను... 

21 Aug 2013

మగాళ్లు ఎవరూ నా వెంట పడకుడదా...

jokes, wife  jokes

ఓ వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో మరణానికి దగ్గరపడ్డాడు.


అయితే, తాను ఎయిడ్స్‌తో చనిపోతున్నానని అందరికీ చెబుతూ వచ్చాడు.

"మీరు అలా ఎందుకు చెబుతున్నావు?" అని భార్య అడిగింది.

"నేను చనిపోయిన తర్వాత  మగాళ్లు ఎవరూ నీ వెంట పడకుండా..." 

 

19 Aug 2013

భార్యాభర్తలన్న తర్వాత గొడవలు రాకుండా ఉంటాయా.. ?

wife jokes, jokes, wife and husband

రంగి:: భార్యాభర్తలన్న తర్వాత గొడవలు రాకుండా ఉంటాయా..
ఎవరో ఒకరు సర్దుకుపోవాలని అనడం తప్పా..


మంగి : తప్పు ఎలా అవుతుంది.. నిజమే కదా..

రంగి : అలా అన్నందుకు సూట్‌కేస్ సర్దుకుని వెళ్లిపోయాడు మా ఆయన రంగడు ...

16 Aug 2013

కట్టుకున్న మొగుడి కన్నా నీకు చీరలే ఎక్కువ...?


భార్యాభర్తల మధ్య తగాదా ఎక్కువ అయింది.
ఈ సమయంలో వారిద్దరి మధ్య
మాటల యుద్ధం...ఇలా.

రంగడు : కట్టుకున్న మొగుడి కన్నా నీకు చీరలే ఎక్కువన్న మాట..

రంగి    : అవును
, చీరల్ని ఇష్టం లేనప్పుడు తీసేసి, వేరేవి కట్టుకోవచ్చు.
          మొగడితో అది కుదరదు కదా..