23 Jan 2014

ఒక మనిషిని పెళ్ళైన వాడని ఎలా చెప్పగలం?

telugu jokes, jokes, telugu hot jokes, adult jokes
ఒక మనిషిని పెళ్ళైన వాడని ఎలా చెప్పగలం?

అతను , అతని పక్కన ఒక స్త్రీ కారులో వుంటే. అతను రెండు చేతుల్లో
వీల్ పటుకొని డ్రైవ్ చేస్తుంటే...  అతను 90% పెళ్లి అయిన వాడు
అయి ఉండచ్చు. లేకపోతే  గెలుక్కుంటా.. కుర్చోడా?

21 Jan 2014

నలుగురు కలిసి చర్చించుకోవటం అంటే ?

telugu jokes, jokes, telugu hot jokes, adult jokes

రంగడు : నలుగురు కలిసి చర్చించుకోవటం అంటే ?

రంగి: ఒక అంగీకారానికి రాకుండా ఉండటం అన్నట్టు... 
రంగడు: అబ్బో ...

19 Jan 2014

నా బొంగు బావ... కొద్దిగా మెదడు ఉపయోగించు...

telugu jokes, jokes, telugu hot jokes, adult jokes

రంగి: ప్రపంచం లో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. ఎవరెస్ట్ శిఖరం
కనిపెట్టకముందు  ఏది ఎత్తైన శిఖరం?

రంగడు: ఏమో... చెప్పిచావు ..
రంగి : నా బొంగు బావ... ఎవరేస్టే.. 

17 Jan 2014

ఇండియాలో పుట్టి, న్యూజిలాండ్లో చనిపోతే ఏమంటాం?

india, jokes, telugu jokes
రంగడు: ఒక వ్యక్తి ఇండియా లో పుట్టి, అమెరికాలో పెరిగి, ఇంగ్లండ్లో తిరిగి,
న్యూజిలాండ్ లో చనిపోతే అతన్ని ఏమంటాం ?

రంగి: ఏమో.. ఏమంటారు ?

రంగడు : చనిపోయాడు అంటాం...

15 Jan 2014

చుట్టాలింటికా... జాగ్రత్త నాయినో... !

jokes, telugu jokes, beegar jokes, family jokes

అమ్మా... బిచ్చం అని అరుస్తున్నాడు... బిచ్చగాడు.

రంగి: అబ్బా...  కరెక్ట్ టైం కి వచ్చావు... మా ఇంటికి చుట్టలచ్చారు...
నీ జోల నాకిచ్చి.. రేపు వడ్డీతో సహా పట్టుక పో.. సరేనా. 

13 Jan 2014

అది అసలు సంగతి. ఇష్టమా ? బొంగా?

doctor jokes, jokes, telugu jokes

ఒక చోట బాక్సింగ్ పోటీలు జరుగుచున్నాయి.
రంగడు: ఊ... కొట్టు.. పళ్ళు పలిగేలా కొట్టు.. దెబ్బ, దెబ్బకు పళ్ళు
పడి పోవాలి అని అరుస్తాడు.

సోమిగాడు: మీకు బాక్సింగ్ అంటే చాలా  ఇష్టం అనుకుంటా? అని అడిగాడు. 
రంగడు: ఇష్టమా ? బొంగా?  ఈ  పక్కనే డెంటిస్ట్ గా ప్రాక్టీసు చేస్తానంతే !!


11 Jan 2014

అసలు సంగతి... ఎంత ముద్దుగా చెప్పావో ?

telugu jokes, doctor jokes, jokes

రంగడు: మీ టేబుల్ పైన చాలా బుక్స్ ఉన్నట్టున్నాయి... పేషెంట్స్
చదవటానికి వుంచారనుకుంటా?

డాక్టర్ : కాదులే... అవి పేషెంట్స్ నా దగ్గరకు వచ్చేవరకు
నాకు బోరు కొట్టకుండా అని చెప్పి... నాలిక కర్చుకున్నాడు. 



9 Jan 2014

ఏడిస్తే... ఎవరైనా అది తినిపిస్తారా...వెధవ!

school jokes, jokes, telugu jokes

రంగి: అరేయ్.. బంటి...  తమ్ముడు ఏడుస్తున్నాడు...
ఏమైనా తినిపించు ..
బంటి: తినిపిస్తే.. ఏడుస్తున్నాడు అమ్మ..

రంగి: అసలు ఏమి తినిపిస్తున్నావు?
బంటి : మిరపకాయ్...

7 Jan 2014

మా ఆవిడకు..మీరే పరిష్కారం చూపించాలి....

jokes, telugu jokes, wife and husband jokes

రంగడు: మా ఆవిడకు... జ్ఞాపకశక్తి సమస్య వుందండి..
డాక్టర్ : అన్నీ మర్చిపోతూ వుంటుందా ?

రంగడు: నా బొంద! ప్రతీది గుర్తు పెట్టుకుంటుంది.
అదే నా ఇబ్బంది!!

5 Jan 2014

అంత అయిపోయిన తరవాత ఇప్పుడెందుకో...విడాకులు?

jokes, telugu jokes, wife and husband jokes

జడ్జి : పెళ్లి చేసుకొని 50 years గడిచిన తర్వాత, ఇప్పుడు
ఎందుకు విడాకులు కావాలనుకుంటున్నారు?

రంగడు: చనిపోయే ముందు అయిన... ప్రశాంతంగా ఉందామని.. . 


3 Jan 2014

అసలు... మన పెళ్లి ఎపుడు అయిందో గుర్తుందా?

cricket jokes, sachin jokes, telugu jokes, jokes

రంగి: మీకు క్రికెట్ తప్ప వేరే  దాని మీద ధ్యాస ఉండదా?
అసలు మన పెళ్లి ఎపుడు అయిందో గుర్తుందా?

రంగడు: ఓ... ఎలా మరచిపోగలను...  ఆసీస్ పై సచిన్ సెంచరీ 
చేసి నాటౌట్ గా  ఉన్నరోజే కదా!

రంగి: నా బొంద...

1 Jan 2014

నీ మనసుకు బాధ పెట్టె పనులు చేయలేను...

doctor jokes, telugu jokes, jokes

డాక్టర్: ఫీజు ఇవ్వకుండా వెళుతారేంటి?

రంగడు: మనసుకు బాధ పెట్టె పనులు చేస్తే రోగం తిరగపడుతుందని
మీరే చెప్పారుగా.